భావ కవితా మహతి
వారణాసి వెంకట్రావు
"వసంతవల్లరి" రచన ద్వారా వెంకట్రావుగారు తెలుగు పాఠకలోకానికి సుపరిచితులవుతున్నారు. ఈ వసంతం కలకాలం నిలిచే వసంతం కావాలి. అనంతంగా పువ్వులు వికసించాలి.
- డాక్టరు సి. నారాయణరెడ్డి, తెలుగు ప్రొఫెసరు
వెంకట్రావుగారి తొలి రచనలో ఎంతో అందం తొంగిచూచింది. పాఠకుల మన్ననలని గ్రంథం అలరిస్తుందని ఆశిస్తున్నాను. ప్రతి గేయం ఎదో ధ్యేయాన్ని అందించాలని చూస్తున్నది. భాష ఎంతో మురుపిస్తున్నది.
- డాక్టరు పోణంగి శ్రీరామ అప్పారావు, డైరెక్టరు, అంతర్జాతీయ తెలుగు సంస్థ
ఈ చిన్ని గ్రంథం వ్రాసిన వెంకట్రావుగారిలో ఎంతో ప్రతిభ గోచరిస్తున్నది. కలంలో మంచి శిల్పం ఉంది. గానం కూడా ఉంది. ఇంకెన్నో చక్కటి కావ్యాలు వ్రాయాలని ఆకాంక్షిస్తున్నాను. తొలి రచనను మించిన రచనలు ముందు చూడగలనని భావిస్తున్నాను.
- డాక్టరు అక్కిరాజు రమాపతిరావు, తెలుగు అకాడమీ
అందమైన భాషను హృద్యమైన శైలిలో - అతి సుకుమారంగా రచించినా గేయాల, గీతాల సంపుటి ఇది. మెత్తదనం, క్రొత్తదనం రెండూ గోచరిస్తాయి ఈ గ్రంథంలో. రావుగారి కలం నిద్రపోకుండా ఉండగలదు.
- డాక్టరు పోరంకి దక్షిణామూర్తి, తెలుగు అకాడమీ
"వసంతవల్లరి" నన్ను అలరించింది. ప్రతీ గేయం చిరుగంటలు మ్రోగించింది. సంస్కృతీ సభ్యతలు చెట్టాపట్టాలు వేసుకున్నాయి. ప్రతీ గేయంలో, జానపద సరళిలో చిరుగజ్జెల రవళి వినిపించింది. రావుగారు ఇంకా బాగా రాణిస్తారు. క్రొత్తదనం కల్పిస్తారు. తెలుగు తల్లిని సేవిస్తారు.
- డాక్టరు జి.వి. సుబ్రహ్మణ్యం, తెలుగురీడరు, ఉస్మానియా విశ్వవిద్యాలయం
- « first
- ‹ previous
- 1
- 2
- 3
